ఇక ఒక్కసారే ఏటీఎం డ్రా. రెండోసారి గీకాలంటే 12 గంటలు ఆగాల్సిందే!!

వినియోగదారుల ను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఎప్పుడూ ఆలోచిస్తా వుంటారనుకొంటా...బ్యాంకింగ్ రంగ అధికారులు.


ఇక నుండి వెంటవెంటనే ఏటీఎంనుంచి విత్ డ్రా కుదరకపోవచ్చు..  


మాములుగా మనం ఏటీఎం లో ఒకేసారి రూ.25వేలు తీసుకోవాలంటే వెంటవెంటనే రెండుసార్లు విత్‌డ్రా చేస్తాం. కానీ.. ఇక ముందు ఈ అవకాశం ఉండకపోవచ్చు. అప్పటినుంచి 12గంటలు గడిచేవరకూ డబ్బులు తీయడానికే అసలు వీలుకాకపోవచ్చు. ఈమేరకు సరికొత్త ప్రతిపాదనను బ్యాంకుల ప్రతినిధులు యోచిస్తున్నారు. ఏటీఎం విత్‌డ్రాల్లో పెరిగిన మోసాలను నివారిచండమెలా అన్నదానిపై ఇటీవల 18 బ్యాంకుల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఇందులో పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఏటీఎంలలో ఒక కార్డు నుంచి ఒకసారి నగదును తీసుకున్న తర్వాత ఆ కార్డు నుంచి 6 నుంచి 12 గంటల దాకా మరో లావాదేవీ జరగకుండా పరిమితి విధించాలని ఢిల్లీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రతిపాదించింది. ఏటీఎంలలో ఆర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, నగదు లావాదేవీల పరంగా పరిమితిని విధిస్తే ఈ తరహా మోసాలను నివారించవచ్చునని ఢిల్లీ ఎస్‌ఎల్‌బీసీ సీఈవో ముఖేశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.